చాంగ్జౌ: చైనా ఓపెన్ సూపర్ 1000 టోర్నీలో భారత పోరాటం ముగిసింది. సింగిల్స్ విభాగాల్లో మిగిలిన ముగ్గురు షట్లర్లూ ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిబాట పట్టారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధుతో పాటు మెన్స్‌లో లక్ష్యసేన్, ఆయుష్ శెట్టి తమ ప్రత్యర్థుల చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు. మొదట సింధు.. 21-16, 20-22, 18-21తో చెన్ యు ఫీ (చైనా) చేతిలో పోరాడి ఓడింది.
రెండేండ్ల తర్వాత ఇటీవలే జపాన్ ఓపెన్ గెలిచిన జోష్‌లో ఉన్న సింధు.. చైనా మాస్టర్స్‌లో మాత్రం ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయింది. ఇక మరో స్టార్ షట్లర్ లక్ష్య.. 19-21, 11-21తో విక్టర్ లై (కెనడా) జోరు ముందు తేలిపోయాడు. తొలి రౌండ్లో మెరుగ్గా ఆడిన ఆయుష్ ప్రిక్వార్టర్స్‌లో మాత్రం 21-15, 13-21, 20-22తో నాట్ ఎన్గుయెన్ చేతిలో పరాభవం పాలయ్యాడు.