ఈ నెల 6న ఏకాంతంగా కల్యాణ వేంకటేశ్వరస్వామి పుష్పయాగం
కల్యాణ వేంకటేశ్వరస్వామి | శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 6న పుష్పయాగం జరుగనుంది.

తిరుమల : శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 6న పుష్పయాగం జరుగనుంది. తిరుమల శ్రీవారి ఆలయం తరహాలోనే పుష్పయాగం జరుగుతోంది. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఉత్సవాన్ని ఏకాంతంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆలయంలో మార్చి 2 నుంచి 10వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఉత్సవాల్లో అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారులు, భక్తులతో ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణతో సమస్త దోషాలు తొలగిపోతాయని అర్చకులు పేర్కొన్నారు.
ఇందు కోసం సోమవారం ఆలయంలో సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు పుణ్యాహవచనం, మృత్స్యంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ జరుగనుంది. 6న ఉదయం 10 నుంచి 11గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయనున్నారు. మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు పుష్పయాగం జరుగనుంది. తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఫిక్స్డ్ డిపాజిట్లపై టీడీఎస్.. ఎలా నివారించుకోవాలంటే..?
పెళ్లి తర్వాత ఆధార్ కార్డులో పేరు ఎలా మార్చాలి?
రేపటి నుంచి 71 అన్రిజర్వ్డ్ రైలు సర్వీసులు
‘ఇడ్లీ’ అమ్మకు సొంత ఇల్లు
బ్యాటరీ లైఫ్ 28 వేల ఏండ్లు!
ఉసురు తీసి.. ప్రాణం పోసి..
రోబో వేసిన పెయింటింగ్‌కు రూ.5 కోట్లు
గాంధీపై ‘జ్యోతి’ అసత్యపు రాతలు
థియరీ తర్వాత ప్రాక్టికల్స్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

