DC vs PBKS : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో రసవత్తర పోరుకు వేళైంది. హ్యాట్రిక్ ఓటములతో ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన పంజాబ్ కింగ్స్(Punjag Kings).. పేలవ ప్రదర్శనతో ఇంటిదారి పట్టేలా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తలపడుతున్నాయి. ధర్మశాల వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో గెలిచి ముందంజ వేయాలని ఇరుజట్లు పట్టుదలతో ఉన్నాయి. టాస్ గెలిచిన అక్షర్ పటేల్ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
గత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ రికార్డు లక్ష్యాన్ని ఛేదించి ఢిల్లీకి షాకిచ్చింది. కేఎల్ రాహుల్ శతకంతో 263 పరుగుల భారీ స్కోర్ కొట్టినా ప్రభ్‌సిమ్రన్ సింగ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ల విధ్వంసానికి కొండంత లక్ష్యం కరిగిపోయింది. అయితే.. ఫీల్డింగ్ వైఫల్యం, క్యాచ్‌లు వదిలేయడం వంటి బలహీనతలను అధిగమించలేక పంజాబ్ వరసగా మూడింటా ఓడింది. ప్లే ఆఫ్స్ పోటీ ఎక్కువైన నేపథ్యంలో ఇప్పుడు ఢిల్లీపై గెలిస్తేనే అయ్యర్ సేన టాప్‌లోకి వెళ్లగలదు. అటు ఢిల్లీ కూడా ఈ మ్యాచ్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనుంది. టాస్కు ముందు ఆసీస్ పేసర్ ద్వారుషీ పంజాబ్ తరఫున డెబ్యూట్ క్యాప్ అందుకున్నాడు.
పంజాబ్ తుది జట్టు : ప్రభ్‌సిమ్రన్ సింగ్(వికెట్ కీపర్), ప్రియన్ష్ ఆర్య, కూపర్ కొన్నొల్లీ, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), సూర్యాన్ష్ షెడ్గే, స్టోయినిస్, శశాంక్ సింగ్, ద్వారుషీ, అర్ష్‌దీప్, చాహల్.
ఢిల్లీ తుది జట్టు : కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), అభిషేక్ పొరెల్, సహిల్ పరాక్, స్టబ్స్, మిల్లర్, అక్షర్ పటేల్(కెప్టెన్), మద్వా తివారీ, ముకేశ్ కుమార్, అకీబ్ నబీ, స్టార్క్, ఎంగిడి.