హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మహిళా కమిషన్ ( Women Commission ) ను ప్రకటించింది . చైర్‌పర్సన్‌గా జీహెచ్ఎంసీ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ( Gadwal Vijayalakshmi ) ని నియమించింది. ఆమెతో పాటు సభ్యులుగా కాసోజు శంకరమ్మ, చిట్యాల శ్వేత, శశికళ యాదవ రెడ్డి, సదాలక్ష్మి, రాధాబాయి, ఉజ్మా అసాయి షకిరాను నియమిం చింది. వీరు ఐదేళ్ల పాటు పదవుల్లో కొనసాగుతారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్ రామకృష్ణరావు విడుదల చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు.