చెన్నై: చెపాక్ మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్‌లో తడబడింది. రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో పంజాబ్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. పిచ్ కూడా బౌలర్లకు సహకరించడంతో పంజాబ్ భారీ షాట్లు ఆడలేకపోయింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 19.4 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌటైంది. ఐపీఎల్ 2021లో నమోదైన అత్యల్ప స్కోర్ ఇదే.
ఆరంభంలో మయాంక్ అగర్వాల్(22: 25 బంతుల్లో 2ఫోర్లు), చివర్లో షారుక్ ఖాన్(22: 17 బంతుల్లో 2సిక్సర్లు) కాసేపు నిలవడంతో ఆమాత్రం స్కోరైనా సాధించింది. కేఎల్ రాహుల్(4), క్రిస్‌గేల్(15), నికోలస్ పూరన్(0), దీపక్ హుడా(13), హెన్రిక్స్(14) విఫలమయ్యారు. ఆరంభం నుంచి క్రమం తప్పకుండా వికెట్లు తీసిన రైజర్స్ బౌలర్లు కింగ్స్‌ను కోలుకోనీయలేదు.
హైదరాబాద్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా అభిషేక్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు. రషీద్ ఖాన్ నాలుగు ఓవర్లలో 17 పరుగులే ఇచ్చి వికెట్ తీశాడు. మధ్య ఓవర్లలో కింగ్స్ బ్యాట్స్‌మెన్‌ను వణికించాడు. పరుగులు రాకుండా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. యువ క్రికెటర్ అభిషేక్ కూడా కళ్లుచెదిరే బంతులతో ప్రత్యర్థిని బోల్తా కొట్టించాడు.
Job well done in the first innings 🙌
— SunRisers Hyderabad (@SunRisers) April 21, 2021
Over to our batsmen now!#PBKSvSRH #OrangeOrNothing #OrangeArmy #IPL2021 pic.twitter.com/3py7n4cWNS