చండీఘఢ్ : ఇంటర్నెట్లో కొన్ని వీడియోలు (Viral Video) చూస్తుంటే సమాజంలో మానవత్వం, దయాగుణం ఇంకా సజీవంగా ఉన్నాయని అనిపిస్తుంది. సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు హృదయాలను తాకితే మరికొన్ని అందరి ముఖాలపై నవ్వులు పూయిస్తాయి.
పంజాబ్‌కు చెందిన ఓ పోలీస్ పాత బట్టలు ఏరుకునే బాలుడికి భరోసాగా నిలిచిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అభయ్ గిరి ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన ఈ వీడియోలో బాలుడికి కానిస్టేబుల్ స్లిప్పర్స్, దుస్తులు అందించడం నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ సమయంలో బాలుడి ముఖంలో ఆనందం వెలకట్టలేనిదని నెటిజన్లు కామెంట్ చేశారు.
ఈ వీడియోను ఇంటర్నెట్లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 62,000కుపైగా లైక్స్ రాగా పెద్దసంఖ్యలో యూజర్లు రియాక్టయ్యారు. అవసరార్ధులకు కానిస్టేబుల్ ఆసరాగా నిలిచారని ప్రశంసలు గుప్పించారు. వీధుల్లో నివసించే వారికి దుస్తులు, చెప్పులు వంటి కనీస సౌకర్యాలు కల్పించేందుకు మరింత మంది ముందుకు రావాలని మరికొందరు నెటిజన్లు కామెంట్ చేశారు.
Read More