నుదుటిపై ముద్దాడిన కర్ణాటక సీఎం బొమ్మై
బెంగళూరు: కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో ఆదివారం నిర్వహించారు. ఆయన తల్లిదండ్రుల సమాధుల పక్కనే ఆయన భౌతిక కాయాన్ని ఖననం చేశారు. పునీత్ వయస్సు 46 ఏండ్లు. శుక్రవారం గుండెపోటుతో మరణించారు. ఆదివారం ఉదయం 5.30 గంటలకు రాజ్‌కుమార్ అంతిమ యాత్ర ప్రారంభం అయింది. 6.30 గంటలకు యాత్ర కంఠీరవ స్టూడియోకు చేరుకొన్నది. వేలాది మంది అభిమానుల అశ్రు నయనాల మధ్య ఈ యాత్ర సాగింది. సీఎం బసవరాజ్ బొమ్మై పునీత్ నుదుటిపై ముద్దాడి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.