టీఆర్ఎస్ అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నది. అందుకే మేమంతా టీఆర్ఎస్ పార్టీకే ఓటేయాలని నిర్ణయించుకున్నాం. ముస్లింలకు షాదీముబారక్, దళితులకు దళితబంధు, ముసలోళ్లు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఆసరా పింఛన్లు ఇస్తున్నరు. రైతులకు రైతుబీమాతో భరోసా ఇస్తున్రు.. ఇవన్నీ ఒక్క టీఆర్ఎస్ మాత్రమే చేసింది. బీజేపీ ప్రభుత్వం ఇలాంటి పథకాలు పెట్టిందా..? అది మతతత్వ పార్టీ..మతం మీద ఓట్లు అడుక్కునే పార్టీ..బండి సంజయ్ గెలిచి మూడేళ్లైతుంది. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలే. పాదయాత్రలు చేస్తుండు తప్ప కేంద్రం నుంచి ఏం నిధులు తేలె. నేనేం జేస్తున్న.. నియోజకవర్గానికి ఏంతెచ్చిన అనేది ఇంతవరకు బండి సంజయ్ చెప్పలే..అదే కేసీఆర్ సారు తాపకో పథకం పెట్టి మంచిగ అమలు చేస్తుండు.. చెప్పినయే కాక చెప్పని పథకాలు కూడా అమలుచేసి చూపిస్తున్నడు. ఇచ్చిన ఎన్నికల హామీలన్నీ నెరవేర్చిండు. బీజేపీ సర్కారు చెప్పిన ఒక్క పనికూడా చెయ్యలే.. అందరి ఖాతాల్లో 15 లక్షలు ఏస్తా అన్నరు.. ఇప్పటికీ ఎయ్యలే.. నల్లధనం వెనక్కు తీసుకువస్తా అని తేలేదు.. ఆర్థిక నేరగాళ్లను శిక్షిస్తా అని అన్నరు..వాళ్లంతా విదేశాలు పోతున్రు.. అందుకే మేం బీజేపీని నమ్ముతలేం. రాదనుకున్న తెలంగాణను తెచ్చి అభివృద్ధి పథంలో తీసుకుపోతున్న కేసీఆర్‌కే ఓటేస్తాం..
మొండెద్దుల రాజమౌళి, గోసంగి కుల సంఘాధ్యక్షుడు, ఉప్పల్
మా రజకులకు సీఎం కేసీఆర్ సార్ కమ్యూనిటీహాల్ కట్టించిండు.. మా పోరాటబిడ్డ చాకలి ఐలమ్మ విగ్రహం పెట్టించిండు. ప్రతి ఏడాది చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతిలను నిర్వహిస్తున్నరు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏడేళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిన్రు. రైతుబంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు ఇస్తున్రు. మా రజకులకు దోబీఘాట్లు కట్టించిన్రు. ఇస్త్రీ షాపులకు 250 యూనిట్ల లోపు కరెంటు బిల్లులు మాఫీ చేస్తున్రు. అందుకే మేమంతా సీఎం కేసీఆర్ వెంటే ఉంటాం. కారు గుర్తుకే ఓటేస్తాం..ఏ ఎలక్షన్ వచ్చినా టీఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తాం..
రావుల ఎల్లయ్య, రజకసంఘం మండలాధ్యక్షుడు (ఇల్లందకుంట)