SULTHANABAD | సుల్తానాబాద్ రూరల్ మార్చి, 28 : పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామానికి చెందిన దాసరి వెంకటేష్ గత పది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా జిల్లా పరిషత్ హైస్కూల్ లో 2004-05 టెన్త్ బ్యాచ్ నకు చెందిన తన తోటి చదువున్న మిత్రులు మృతుడి భార్య హారిక, కూతురు సమీక్ష, అశ్విక, కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం రూ.10 అందజేశారు. ఈ కార్యక్రమంలో వి మనోజ్, పూసాల రాజుకుమార్, అజ్జు, వడ్లూరి శ్రీధర్, శ్రీకర్, హమీద్, మారవేణి శ్రీను, గౌస్, సునీల్, సాగర్ బొమ్మ శ్రీధర్, దేవేందర్ అర్జున్, పరుశరామ్, మధు, బూరుగు రాకేష్ గౌడ్, పవన్ బుర్ర రాజు గౌడ్, బండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.