నిజామాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నిరసనలు పోటెత్తాయి.
నిన్న పార్లమెంట్లో తెలంగాణ ఏర్పాటు పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు.
తక్షణం తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రం ఏర్పడి 8 ఏండ్లు కావస్తున్నప్పటికి బిజెపి ప్రభుత్వానికి తెలంగాణపై విషం చిమ్మడం, నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించడం సరి కాదంటూ మండిపడ్డారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున మోదీకి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఆర్మూర్, బాల్కొండ, బోధన్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్స్ వాడ నియోజకవర్గాల్లో ప్రధాని దిష్టిబొమ్మలను దహనం చేశారు.