మోకరిల్లి మనసులోని మాటను చెప్పడం పాత ట్రెండే! కానీ, ఆ ఘట్టాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవడం అన్నది సరికొత్త ట్రెండ్. ఆ ప్రయత్నంలో మీకు సహకరించేందుకు ప్రపోజల్ ప్లానర్స్ సిద్ధంగా ఉన్నారు. మీ ఐడియాతో పాటు తన ఇష్టాయిష్టాలు కూడా చెబితే అదిరిపోయే సెట్స్ సిద్ధం చేస్తారు. ఎలా ప్రపోజ్ చేయాలో బోధిస్తారు. ఆ మధుర క్షణాలకు వీడియో రూపం ఇస్తారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరులో ఇలాంటి సంస్థలు విజయం సాధించాయి. ధరలు కూడా బడ్జెట్లోనే ఉంటాయి. ఎవరికైనా ప్రపోజ్ చేయాలనుకుంటే ఓ సారి ప్లానర్స్ను కలవండి. మీ ప్రేమ సగం సక్సెస్ అయినట్టే. మిగతా సగం.. సెయింట్ వాలెంటైన్ దయ!