Telangana | తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అలాగే వైఎస్ చైర్మన్‌గా ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తమ్‌ను నియమించింది. వీరు ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి ప్రస్తుతం నల్సార్ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్నారు.
మహిళా యూనివర్సిటీ ఇన్‌ఛార్జి వీసీగా ధనావత్ సూర్య, బాసర ట్రిపుల్ ఐటీ ఇన్‌ఛార్జి వీసీగా ప్రొఫెసర్ గోవర్దన్ (జేఎన్టీయూ)ను నియమించారు.
Balakista Reddy