కరవు వేళ గ్లోబల్ సమ్మిట్ అవసరమా?
ఎల్ నినో కారణంగా తీవ్రమైన కరవు, తాగునీటి ఎద్దడిని ఎదురొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించడం ఏమాత్రం సమంజసం కాదని ప్రముఖ విద్యావేత్త, రామన్‌మెగసెసె అవార్డు గ్రహీత శాంతాసిన్హా అభిప్రాయపడ్డారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగనున్న ఈ సదస్సును వాయిదా వేయాలని కోరారు. ఓ టీవీ చానల్‌కు ఆమె ఇంటర్వ్యూ ఇస్తూ..
- ప్రభుత్వానికి ప్రొఫెసర్ శాంతా సిన్హా సూచన
- వేల కోట్ల ఖర్చుతో సదస్సు నిర్వహించడం సరికాదు
- ఫైవ్‌స్టార్ వసతుల కోసం నీరు, విద్యుత్తు వృథా చేయొద్దు
- ప్రతినిధులకు మెసేజ్ ఇచ్చి సమ్మిట్‌ను వాయిదా వేయాలి
హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఎల్ నినో కారణంగా తీవ్రమైన కరవు, తాగునీటి ఎద్దడిని ఎదురొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించడం ఏమాత్రం సమంజసం కాదని ప్రముఖ విద్యావేత్త, రామన్‌మెగసెసె అవార్డు గ్రహీత శాంతాసిన్హా అభిప్రాయపడ్డారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగనున్న ఈ సదస్సును వాయిదా వేయాలని కోరారు. ఓ టీవీ చానల్‌కు ఆమె ఇంటర్వ్యూ ఇస్తూ.. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని, యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలని తాము కూడా కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. రైతులు సాగునీరు, ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న సమయంలో రూ.వేల కోట్లు ఖర్చు పెట్టి గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని చెప్పారు.
ప్రస్తుత విపతర పరిస్థితులను వివరిస్తూ అతిథులకు మెసేజ్ ద్వారా సమాచారం అందించి సదస్సు వాయిదా వేయవచ్చని సూచించారు. 4,000 మంది దేశ విదేశీ ప్రతినిధుల కోసం ఫైవ్‌స్టార్ హోటళ్లు, విందులు, ఇతర విలాసవంతమైన ఏర్పాట్లు చేయడం వల్ల భారీ ఎత్తున నీరు, విద్యుత్తు, ప్రజాధనం వృథా అవుతాయని శాంతాసిన్హాతో పాటు 400 మంది ప్రముఖులు ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాశారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నాలుగు రోజులకు ఒకసారి తాగునీరు వస్తుండగా, నీటి కొరత కారణంగా పాఠశాలలు, హాస్టళ్ల విద్యార్థులను ఇండ్లకు పంపిస్తున్న పరిస్థితులు ఉన్నాయని గుర్తుచేశారు. మరోవైపు, డిసెంబర్ 8న ఇదే సమ్మిట్‌లో ఎల్ నినో, వాతావరణ మార్పులు, కరవుపై ప్రత్యేక సదస్సు (క్లైమైట్ కాంక్లేవ్) నిర్వహించడం విడ్డూరంగా ఉన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్లోబల్ సమ్మిట్ వాయిదా వేయాలి
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు నెలకొన్న నేపథ్యంలో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 వాయిదా వేయాలని పౌర సంఘాలు గురువారం తెలంగాణ రైజింగ్ విజన్ 2047 సలహా మండలిలోని 16 మంది సభ్యులకు బహిరంగ లేఖ రాశాయి. డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ వాయిదా వేయాలని కోరాయి. దేశవ్యాప్తంగా 400 మందికిపైగా పౌరులు, పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, మాజీ అధికారులు సీఎంకు బహిరంగ లేఖ రాసినట్టు వెల్లడించాయి. సలహా మండలి సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని కోరాయి. రఘురామ్‌రాజన్, అభిజిత్ బెనర్జీ, అరుణారాయ్, దువ్వూరి సుబ్బారావు, రఘురామ్ రాజన్ వంటి ప్రముఖులకు కూడా లేఖ పంపారు. పెట్టుబడుల సదస్సు నిర్వహణపై పునరాలోచించి, రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేవరకు వాయిదా వేయాలని పౌర సంఘాలు డిమాండ్ చేశాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

