ఆజాదీ కా అమృత్ మహూత్సవ్ పిలుపుతో ప్రేరణ పొంది స్వాతంత్య్రం కోసం చిన్న వయసులో ప్రాణత్యాగం చేసిన ఖుదిరామ్ బోస్ బయోపిక్‌ను నిర్మించిన విజయ్ జాగర్లమూడి ఇటీవల గుండెపోటుకు గురయ్యారు. ప్రసుత్తం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ చిత్రం విడుదలకు నోచుకోకపోవడంతో ఆర్థిక సమస్యల వత్తిడితో నిర్మాత గుండెపోటుకు గురయ్యారని చిత్రబృందం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలియజేసింది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందించగా, తోటతరణి ప్రొడక్షన్ డిజైనర్‌గా, సినిమాటోగ్రాఫర్‌గా రసూల్ ఎల్లోర్ పనిచేశారు.