‘నటిగా నేను ఈ స్థాయిలో ఉన్నానంటే.. దానికి ప్రధాన కారణం నా అందమైన శరీరం. ఏ పాత్రనైనా అర్థం చేసుకొని ముందుకెళ్లే క్రమంలో నాకు సర్వవిధాలా సహకరించింది నా శరీరం. అందుకే దాని విలువ వెలకట్టలేనిది. ఒక్క సినిమా కోసం దాన్ని పాడుచేసుకోవడం నా వృత్తికే ద్రోహం చేసినట్టు లెక్క’ అంటున్నది బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా. ఆమె నటించిన హాలీవుడ్ చిత్రం ‘ది బ్లఫ్’ ఈ నెల 25న అమెజాన్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఆ సినిమా గురించి చెబుతూ పై విధంగా స్పందించింది ప్రియాంక చోప్రా. ‘ ‘ది బ్లఫ్’ నేను కష్టపడి నటించిన సినిమా. ఇందులో నాలుగు ప్రమాదకరమైన స్టంట్స్ ఉన్నాయి.
ముఖంపై గాజు పెంకులు గుచ్చుకునేంత రిస్కీ ఫైట్స్ అవి. అందుకే దర్శకుడు ఫ్రాంకీ నన్ను ఆ స్టంట్స్ చేయనివ్వలేదు. నిజానికి నేను కూడా ఆసక్తి చూపలేదు. డూప్‌తో చేయించేశారు. ఒకవేళ నేను చేసుంటే.. నేను చేస్తున్న ప్రస్తుత సినిమాల విషయంలో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సివచ్చేది.’ అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక. ప్రస్తుతం ఈ అందాలభామ ఎస్.ఎస్.రాజమౌళి, మహేశ్‌బాబు కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’లో మహేశ్‌కు జోడీగా మందాకినీ అనే పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే.