ఎక్కడ ఉన్నా సంస్కృతి, సంప్రదాయాల్ని విధిగా పాటిస్తానని చెబుతున్నది గ్లోబర్స్టార్ ప్రియాంకచోప్రా. భర్త నిక్జోనాస్తో అమెరికాలో వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న ఈ భామ ఇటీవలే నూతన గృహంలోకి ప్రవేశించింది. లాస్ఏంజిలస్లో అత్యంత విలాసవంతంగా సకలసదుపాయాలతో ఈ ఇంటిని నిర్మించుకుంది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని నూతన గృహ ప్రవేశం జరుపుకున్నానని ప్రియాంకచోప్రా ఆనందం వ్యక్తం చేసింది. అందంగా అలంకరించిన దీపకాంతుల నడుమ వెలుగులీనుతున్న తన ఇంటి ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది ప్రియాంకచోప్రా. ‘సొంత ఇంటిలో తొలి దీపావళి జరుపుకోవడం సంతోషంగా ఉంది. మా ఇద్దరి కలలసౌధమిది. భారతీయ సంప్రదాయాలను పాటిస్తూ ఈ వేడుకను నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది. నా కలలన్నింటిని ప్రతిఫలించేలా ఇంటి డిజైనింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నా’ అని చెప్పింది ప్రియాంకచోప్రా.