ఏడో వారంలో ఎలిమినేట్ అయి స్టేజ్ మీదకు వచ్చిన ప్రియతో నాగార్జున ఓ ఆట ఆడించాడు. హౌస్‌మేట్స్‌కు రిపోర్డ్ కార్డ్ ఇవ్వమని ఆదేశించాడు. మొదటగా లోబో గురించి చెప్పిన ప్రియ.. అతడు తనకు అర్థం కాడంటూ ఐదు మార్కులిచ్చింది. హర్ట్ చేయకుండా గేమ్ ఆడాలంటూ విశ్వకు 5 మార్కులు ఇచ్చింది. షణ్ముఖ్‌కు ఎనిమిదిన్నర మార్కులేస్తూ ఇలాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ ఉండాలంది.
షణ్ముఖ్ బ్రెయిన్‌తో గేమ్ ఆడుతున్నాడని చెప్పుకొచ్చింది. రవికి ఏడు మార్కులు ఇచ్చింది. చాలా మంచి వాడు. ఇక నిన్ను సిల్లీ కారణాలతో నామినేట్ చేసేవారు ఉండరు అని ప్రియ నవ్వించే ప్రయత్నం చేసింది. ఇక సిరికి ఎనమిదిన్నర మార్కులు ఇచ్చింది.శ్రీరామచంద్రకు నాకు అంతగా ర్యాపోలేదు. కనెక్ట్ అయితే బాగా నవ్విస్తాడు అంటూ ఎనిమిది మార్కులు ఇచ్చింది.
ప్రియ కోసం ఓ పాట పాడమని నాగార్జున అడిగాడు. ఎందుకంటే ప్రేమంటే సినిమాలోని ఎమోషనల్ సాంగ్ పాడి అందరినీ టచ్ చేశాడు. ప్రియాంకకు పది మార్కులకు వంద మార్కులు ఇచ్చింది. చాలా మంచిది. పొద్దున లేవగానే ఆమె మొహమే చూస్తాను. ఆమె మొహం చూడని రోజు నాకు ఏదో ఒకటి జరుగుతుంది అని చెప్పుకొచ్చింది ప్రియ. అనీ మాస్టర్‌కి పది మార్కులు ఇచ్చి ఆమె అందరిని గుడ్డిగా నమ్మేస్తుందని పేర్కొంది.
జెస్సీకి ఎనిమిది మార్కులు ఇచ్చి.. ఆట విషయానికి వచ్చే సరికి బాగా ఆడుతుంటాడు అని చెప్పింది. నీ గర్ల్‌ఫ్రెండ్ దీప్తికి ఏమైనా చెప్పాలా? అని ప్రియ అడగ్గా ఆ మాట చాలంటూ సంతోషించాడు షణ్ను. అయితే దీప్తిని మర్చిపోయి హాయిగా ఉంటున్నావని ఆమెకు చెప్తానని ప్రియ ఉడికించడంతో వణికిపోయాడు షణ్ను. మా ఇంట్లో కూడా భయపడను, కానీ ఆ అమ్మాయికి భయపడతానన్నాడు.
కాజల్‌కు ఏడు మార్కులు ఇచ్చింది. ఇప్పుడు ఆమె వేసే ప్రతీ అడుగు మాకు తెలిసిపోతోంది. చాలా జాగ్రత్తగా ఆడు అని సలహా ఇచ్చింది. మానస్‌కు పది మార్కులు ఇచ్చింది. మానస్ బంగారు కొండ అని చెప్పింది. సన్నీకి 9 మార్కులు ప్రియ ఇచ్చింది. ఆటలో ఎన్నో అనుకున్నాం అవన్నీ అక్కడికే వదిలేయాలి. నా ప్లేట్లో తినే హక్కు, నా కాఫీ కప్పులో కాఫీ తాగే హక్కు ఒక్క సన్నీకి మాత్రమే ఉంటుందని చెప్పిన ప్రియ వీడ్కోలు పలికింది.