అమరావతి : ఏపీలోని మార్కాపురం జిల్లాలో(Markapuram District) ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు(Private travel Bus) రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద టిప్పర్ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో భయంతో పది మంది ప్రయాణికులు దిగిపోగా ఘటనలో మరో పది మంది సజీవదహనమయ్యారు. 12 మంది గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు.
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మృతులు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, ఘటనా స్థలాన్ని మర్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.