Prithviraj Sukumaran As Kumbha | దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం SSMB29 (వర్కింగ్ టైటిల్). ఈ సినిమా గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో రాజమౌళి సడన్గా ఓ బిగ్ ట్రీట్ ఇచ్చారు. నవంబర్ 15న జరగబోయే ‘గ్లోబ్ ట్రాటర్’ (Globetrotter) అనే భారీ ఈవెంట్కు ముందు మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్కి సంబంధించిన ఫస్ట్ లుక్ను చిత్రబృందం నేడు విడుదల చేసింది. ఈ సినిమాలో పృథ్వీరాజ్ ‘కుంభ’ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ విలన్ పాత్ర పోషిస్తున్నట్లు లుక్ చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించి నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా భారీ ఈవెంట్ జరుగబోతుంది. ఈ వేడుకలోనే మూవీకి సంబంధించిన విశేషలతో పాటు టైటిల్ను రివీల్ చేయబోతున్నాడు దర్శకుడు రాజమౌళి.
Presenting KUMBHA..The most complex mind I have ever played…
Ready for you @urstrulymahesh 🔥
It’s game on @priyankachopra.Thank you @ssrajamouli sir for crafting a world that constantly tests my limits… 😇🙏🏻#GlobeTrotter@mmkeeravaani @SriDurgaArts @SBbySSK pic.twitter.com/zyCV1ZZy4l
— Prithviraj Sukumaran (@PrithviOfficial) November 7, 2025