Abbas Afridi: ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన పాకిస్థాన్ బ్యాటర్.. వీడియో
Abbas Afridi: ఒకే ఓవర్లో.. వరుసగా ఆరు బంతుల్లో.. ఆరు సిక్సర్లు కొట్టాడు పాకిస్థాన్ బ్యాటర్ అబ్బాస్ అఫ్రిది. హాంగ్ కాంగ్ సిక్సెస్ టోర్నీలో కువైట్‌తో జరిగిన మ్యాచ్‌లో అబ్బాస్ ఆ ఫీట్ క్రియేట్ చేశాడు.
హాంగ్‌కాంగ్: పాకిస్థాన్ బ్యాటర్ అబ్బాస్ అఫ్రిది(Abbas Afridi).. సిక్సర్ల మోత మోగించాడు. హాంగ్ కాంగ్ సిక్సెస్ టోర్నమెంట్లో భారీ స్ట్రోక్స్‌తో అలరించాడు. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టి అందర్నీ స్టన్ చేశాడు. దీంతో కువైట్‌తో జరిగిన రసవత్తర పోరులో చివరి బంతికి పాకిస్థాన్ విజయం సాధించింది. యాసిన్ పటేల్ బౌలింగ్‌లో వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాడు అబ్బాస్. 12 బంతుల్లో 55 రన్స్ స్కోరు చేసిన అతను జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
హాంగ్ కాంగ్ సిక్సెస్ టోర్నీలో ప్రతి జట్టు ఆరు ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కువైట్ జట్టు 123 రన్స్ చేసింది. అయితే 124 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన పాకిస్థాన్ మరో బంతి మిగిలి ఉండగా లక్ష్యాన్ని అందుకున్నది. మాంగ్‌కాక్ మిషన్ రోడ్డు గ్రౌండ్లో జరిగిన మ్యాచ్ ఫుల్ టెన్షన్ పుట్టించింది. అబ్బాస్ గతంలో పాక్ జాతీయ జట్టుకు ఆడాడు. 2024 జూలైలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. న్యూజిలాండ్‌తోనూ కొన్ని మ్యాచ్‌లు ఆడాడు.
పాకిస్థాన్ తరపున 24 టీ20 మ్యాచుల్లో అబ్బాస్ ఆడాడు. కానీ ఆ ఇన్నింగ్స్‌లో పెద్ద స్కోరు చేయలేకపోయాడతను. 12.18 సగటుతో అతను కేవలం 134 రన్స్ మాత్రమే చేశాడు. అందుకే అతను పాక్ జాతీయ జట్టుకు దూరం అయ్యాడు.
🚨Big win for Pakistan against Kuwait in the Hong Kong Super Sixes! 🔥
They beat Kuwait by 4 wickets, with Abbas Afridi smashing six sixes in an over! 🤯#HongKongSixes pic.twitter.com/WjppEmAqTx
— ICC Asia Cricket (@ICCAsiaCricket) November 7, 2025
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

