Khushbu Sundar | జర్నలిజం తన విలువను కోల్పోయింది.. గౌరీ కిషన్ బాడీ షేమింగ్ ప్రశ్నపై నటి ఖుష్బూ ఆగ్రహం!
Khushbu Sundar | మలయాళ నటి గౌరీ కిషన్‌ను ఒక రిపోర్టర్ బరువు గురించి అడిగి బాడీ షేమింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో నటి గౌరీ కూడా సదరు రిపోర్టర్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
Khushbu Sundar | మలయాళ నటి గౌరీ కిషన్‌ను ఒక రిపోర్టర్ బరువు గురించి అడిగి బాడీ షేమింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో నటి గౌరీ కూడా సదరు రిపోర్టర్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అయితే ఈ విషయంలో ఇప్పటికే గౌరీకి పలువురు నుంచి మద్దతు లభిస్తుండగా.. తాజాగా నటి ఖుష్బూ కూడా ఈ విషయంపై స్పందిస్తూ.. జర్నలిస్టుల తీరును తప్పుబట్టింది. ఈ సందర్భంగా వివాదంపై ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది.
జర్నలిజం తన విలువను కోల్పోయింది. ఈ సోకాల్డ్ జర్నలిస్టులు జర్నలిజాన్ని పాతాళానికి తీసుకుపోతున్నారు. ఒక మహిళ ఎంత బరువు ఉందనేది వారి పని కాదు. దీని గురించి హీరోను అడగడం ఏంటి? ఎంత సిగ్గుచేటు! అని ఖుష్బూ మండిపడ్డారు. ఇలాంటి ప్రశ్నకి తన స్థానంలో గట్టిగా నిలబడి, దీటుగా సమాధానం చెప్పిన యువ నటి గౌరీ కిషన్‌కి నా ధన్యవాదాలు అని ప్రశంసించారు. ఇదే ప్రశ్నను నటీమణులు లేదా మహిళలు జర్నలిస్ట్ ఫ్యామిలీలోని మహిళలను అడిగితే ఇలానే సమాధానం చెబుతారా. గౌరవం అనేది ఎప్పుడు ఏకపక్షం కాదు. మీరు గౌరవం ఆశిస్తే.. ముందు గౌరవం ఇవ్వడం నేర్చుకోండి అంటూ ఖుష్బూ రాసుకోచ్చింది. ఈ పోస్ట్‌కి ఖుష్బూ #RespectAllWomen (మహిళలందరినీ గౌరవించండి), #shamefuljournalism (సిగ్గుచేటైన జర్నలిజం), #bodyshaming (శరీరాన్ని కించపరచడం) వంటి హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.
Journalism has lost its ground. The so called journos take journalism to the gutters. How much a woman weighs is none of their business. And asking the hero about it?? What a shame! Kudos to the young #GowriShankar who stood her ground and gave it back. Are the same men ok if…
— KhushbuSundar (@khushsundar) November 7, 2025
అసలు ఏం జరిగిందంటే.. ఈ మూవీలో ఓ పాట సన్నివేశంలో హీరో ఆదిత్య మాధవన్ గౌరీని ఎత్తుకుని తిప్పుతాడు. అయితే చిత్రబృందం నిర్వహించిన ప్రెస్ మీట్లో ఈ విషయాన్ని సాకుగా తీసుకుని రిపోర్టర్ హీరోని అడుగుతూ.. హీరోయిన్ను ఎత్తుకుని తిరిగేటప్పుడు ఆమె బరువు ఎంత ఉంది? భారీగా అనిపించిందా? అని అడుగుతాడు. దీనికి హీరో సమాధానమిస్తూ.. నేను జిమ్ చేస్తాను కాబట్టి భారీగా అనిపించలేదు అని చెబుతాడు. అయితే ఈ ఘటన జరిగిన మరుసటి రోజు మరో ప్రెస్ మీట్ జరుగుతుంది.. ఆ ఈవెంట్లో కూడా సదరు రిపోర్టర్ గౌరీ బరువు గురించి మళ్లీ అడుగుతాడు. దీంతో చిర్రెత్తుకోచ్చిన గౌరీ ఆ రిపోర్ట్ర్పై విరుచుకుపడింది.
నా బరువు తెలుసుకుని నువ్వు ఏం చేయబోతున్నావు? ఇది బాడీ షేమింగ్! ఒక స్త్రీని ఆబ్జెక్టిఫై చేస్తున్నావు. నా పాత్ర గురించి, నా నటన గురించి ఒక్క ప్రశ్న కూడా లేదు. అందరూ నా బరువే అడుగుతున్నారు. మగ నటుల్ని ఇలా అడిగే ధైర్యం మీకు ఉందా? ఇది జర్నలిజం కాదు… మీ వృత్తికే అవమానం అంటూ ప్రశ్నలతో కడిగిపారేసింది. అయితే కొంతమంది రిపోర్టర్లు ఆ ప్రశ్నను కేవలం సరదాగా అడిగినట్లు కొట్టిపారేయడానికి ప్రయత్నించారు. కానీ గౌరీ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించింది. నాకు అది సరదాగా అనిపించలేదు. బాడీ-షేమింగ్‌ను నార్మలైజ్ చేయడం ఆపండి. ఆ ప్రశ్న నా గురించి కాబట్టి నా అభిప్రాయాన్ని చెప్పే హక్కు నాకు ఉంది అని ఆమె తేల్చి జెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rib Remodelling | నడుమును సన్నగా మార్చే రిబ్ రీమోడలింగ్ శస్త్ర చికిత్స.. అసలిదేమిటి.. ఏం చేస్తారు..?
Pragya Jaiswal | వెకేషన్ మూడ్‌లో ప్రగ్యా జైస్వాల్.. అదిరిపోయిన అవుట్డోర్ ఫొటోషూట్!
Anirudh-Kavya | అనిరుధ్ -కావ్య మారన్ పెళ్లి సందడి షురూ.. గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్, చెన్నై రిసెప్షన్
Uranium Stockpile: యురేనియంను తరలించనున్న ఇరాన్
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమాలో హీరోయిన్గా తెలుగు అమ్మాయి.. రేసులోకి ఆ అమ్మడి పేరు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

