Elon Musk | న్యూఢిల్లీ: కెనడా ప్రధాని ట్రూడో రాజకీయ భవిష్యత్తుపై టెస్లా అధిపతి, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఓడిపోయి, ప్రధాని పదవిని పోగొట్టుకుంటారని తెలిపారు. ఒక యూజర్ ఎక్స్‌లో అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా బదులిచ్చారు.
ప్రభుత్వ పర్యవేక్షణ కోసం ఆన్లైన్ స్ట్రీమింగ్ సేవాసంస్థలు తప్పక నమోదు చేయాలంటూ కెనడా ప్రభుత్వం తెచ్చిన నిబంధన వాక్ స్వాతంత్య్ర హక్కుకు భంగం కలిగిస్తుందని ఇటీవల ట్రూడోపై ఎలాన్ మస్క్ విమర్శలు చేశారు. మైనారిటీలో ఉన్న ట్రూడో ప్రభుత్వం సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నది.