
సైదాబాద్, నవంబర్ 14 : ప్రచంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా కవులు తమ రంగాన్ని విస్తరించాలని ప్రముఖ కవి డాక్టర్ శివారెడ్డి అన్నారు. ఆదివారం మలక్‌పేట బి-బ్లాక్‌లోని ముంతాజ్ కాలేజ్ ఆవరణలో కవి యాకుబ్, శిలాలోలిత సారథ్యంలో ఏర్పాటు చేసిన ‘రొట్టమాకురేవు’ కవిత్వ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా షేక్ మహమ్మద్ మియా స్మారక అవార్డును మునాసు వెంకట్ (మెద), పురిటిపాటి రామిరెడ్డి స్మారక అవార్డును మందరపు హైమవతి (నీలిగోరింట), కేఎల్.నర్సింగ్ రావు స్మారక అవార్డులను నరేశ్ కుమార్ సూఫీ (నిశ్శబ్ద), తగుళ్ల గోపాల్ ( దండకడియం)కు అందజేశారు. అనంతరం కాసుల రవికుమార్ రచించిన ‘గడ్డ కట్టిన నది’, దాసరి నాగభూషణం రచించిన ‘కరోనా కలకలం’, పెనుగొండ సరసిజ రచించిన ‘ఇక మారాల్సింది నువ్వే’ వంటి పుస్తకాలను ఆవిష్కరించారు. ఆనందాచారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టర్ సీతారాంకవి, శిలాలోలిత, యాకుబ్, లిఖిత్‌కుమార్ గోడా, శ్రీనిధి, రావెళ్ల రవీంద్ర, రూపారుక్మిణి, లక్ష్మీశ్రీ, చిరుగాల్ పల్లి ప్రసాద్, రహీమొద్దిన్, గీతా వెల్టంకీ, తండ హరీశ్ గౌడ్, తాళ్లపల్లి శివకుమార్, ఇస్లావత్ గోవర్ధన్ నాయక్, పద్మజ బొలిశెట్టి, గట్టు రాధికమోహన్ తదితరులు పాల్గొన్నారు.