NEET PG 2026 | ఆగష్టు 30న నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష.. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.. కీలక డేట్స్ ఇవే
NEET PG 2026 : మెడికల్ విద్యార్థులకు 2026లో పీజీలో అడ్మిషన్ల కోసం నిర్వహించే నీట్ పీజీ ప్రవేశ పరీక్ష తేదీ వచ్చేసింది. ఆగష్టు 30న నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష జరగనుంది. ఇందుకోసం దరఖాస్తుల ప్రక్రియ జూలై 1 సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రారంభమైంది. దరఖాస్తులు సమర్పించేందుకు చివరి తేదీ జూలై 21, రాత్రి 11.55 గంటలు.
NEET PG 2026 : మెడికల్ విద్యార్థులకు 2026లో పీజీలో అడ్మిషన్ల కోసం నిర్వహించే నీట్ పీజీ ప్రవేశ పరీక్ష తేదీ వచ్చేసింది. ఆగష్టు 30న నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష జరగనుంది. ఇందుకోసం దరఖాస్తుల ప్రక్రియ జూలై 1 సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రారంభమైంది. దరఖాస్తులు సమర్పించేందుకు చివరి తేదీ జూలై 21, రాత్రి 11.55 గంటలు. ఈ పరీక్షను ఎన్బీఈఎంఎస్ (నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్) సంస్థ నిర్వహిస్తుంది. ఇటీవల నీట్ యూజీ పేపర్ లీక్ నేపథ్యంలో పీజీలో ప్రవేశం కోసం అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కాపీయింగ్ జరగకుండా చాలా రూల్స్ అమలు చేయనుంది ఎన్బీఈఎంఎస్. టెస్ట్ సిటీ కేటాయింపు రూల్స్ మార్చేశారు. అంటే ముందుగా దరఖాస్తు చేసుకున్నంత మాత్రాన కోరుకున్న సిటీలో ప్రవేశపరీక్ష రాసే అవకాశం ఉండదు. ఫస్ట్ కమ్.. ఫస్ట్ సర్వుడ్ బేసిస్ విధానం ఉండదు. అభ్యర్థులు పరీక్ష రాసేందుకు తప్పనిసరిగా మూడు రాష్ట్రాలను, అక్కడి సిటీలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. వాటిలోంచే పరీక్ష రాసే సిటీలను కేటాయిస్తారు. ఆధార్ అథెంటికేషన్, బయోమెట్రిక్ రూల్స్‌ను తప్పనిసరి చేయనున్నారు. దీనికోసం విద్యార్థులు పరీక్ష రాసే సమయానికి చేతికి, వేళ్లకు హెన్నా, రంగులు వంటివి రాసుకుని ఉండకూడదు. ఇతరులతో అప్లికేషన్ వివరాలు పంచుకోకూడదు.
అభ్యర్థులకు ఆగష్టు 11 నుంచి అడ్వాన్స్‌గా ఎగ్జామినేషన్ సిటీకి సంబంధించిన వివరాలు అందుబాటులో ఉంటాయి. ఆగష్టు 30న ప్రవేశ పరీక్ష జరిగితే, సెప్టెంబర్ 30లోపు ఫలితాలు వెల్లడవుతాయి. దరఖాస్తు సందర్భంగా పరీక్షుక సంబంధించిన నియమ నిబంధనల్ని అభ్యర్థులు తప్పనసరిగా చదవాలని ఎన్బీఈఎంఎస్ సూచించింది. పూర్తి వివరాలకు సంబంధిత వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- application
- exam
- NBEMS
- NEET-PG 2026
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene Review | ‘సీన్’ సినిమా రివ్యూ.. సూర్య కొత్త సినిమా ఎలా ఉందంటే!
Former Minister Talasani | దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ ను వెంటనే విడుదల చేయాలి : మాజీ మంత్రి తలసాని
Palakurthi Congress Leaders | భారత పౌరసత్వమే లేని ఝాన్సీ రెడ్డికి పీసీసీ పదవి ఎలా ఇస్తారు?
Fire At Oil India Tank Farm | ఆయిల్ ఇండియా సంస్థ చమురు నిల్వల వద్ద అగ్నిప్రమాదం.. ఒకరు మృతి, పలువురికి గాయాలు
Peptides | అమెరికా ఆరోగ్య రంగంలో కీలకమార్పు.. పెప్టైడ్ల వినియోగానికి గ్రీన్ సిగ్నల్.. ఏంటివి.. ఎలా పనిచేస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

