
కావలసిన పదార్థాలు
సజ్జలు: ఒక కప్పు, ఉప్పు: తగినంత, నీళ్లు: మూడు కప్పులు, నూనె: రెండు టేబుల్ స్పూన్లు.
తయారీ విధానం
ముందుగా సజ్జలను బరకగా మిక్సీ పట్టి జల్లించి పిండి, రవ్వ వేరుచేసి పెట్టుకోవాలి. స్టవ్‌మీద మందపాటి గిన్నె పెట్టి నీళ్లు పోసి తగినంత ఉప్పు, ఒక స్పూన్ నూనె వేసి మరుగుతున్న దశలో సజ్జ రవ్వ కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. బాగా దగ్గర పడ్డాక పిండి కూడా వేసి, మరో రెండు నిమిషాలు కలుపుతూ.. ఇంకాస్త ఉడికించుకొని దింపి చల్లారనివ్వాలి. తర్వాత, చేతికి కొద్దిగా నూనె రాసుకుని ఆ సంకటిని ముద్దల్లా చేసుకుంటే ఆరోగ్యకరమైన సజ్జ సంకటి సిద్ధం.