రమణ సాకే, వనిత గౌడ జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రేమలో రెండోసారి’. సత్య మార్క దర్శకుడు. సిద్ధ క్రియేషన్ పతాకంపై నీరజ లక్ష్మి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ఇటీవల ప్రముఖ దర్శకుడు తేజ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఈ భూమి ఉన్నంత వరకు ప్రేమకు మరణం లేదనే హృద్యమైన పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారని అన్నారు.
నేటి యువత మెచ్చే చిత్రమిదని, అక్టోబర్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు సత్య మార్క పేర్కొన్నారు. జబర్దస్త్ శ్రీను, బాబీ, దుర్గారావు, జబర్దస్త్ ఫణి, సతీష్ సారపల్లి తదితరులు ఈ చిత్ర తారాగణం.