వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఓడాలిజ్ మార్టినెజ్ (25) ఆగస్టులో ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చారు. కవలలు పుట్టడం సాధారణమే కదా అనుకొంటున్నారా.. వాళ్లు కవలలు కాదు. ఐదు రోజుల వ్యవధితో పుట్టారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. తల్లి ఓడాలిజ్ ఐదు రోజుల వ్యవధిలోనే రెండుసార్లు గర్భం దాల్చారు. అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే మళ్లీ గర్భం ధరించారన్నమాట. ఇది చాలా అరుదైన విషయమని వైద్యులు తెలిపారు. మహిళల్లో అప్పుడప్పుడు ఒకటి కంటే ఎక్కువ అండాలు విడుదల అవుతాయని, ఇలాంటి సందర్భాల్లో ఇలా గర్భం ధరించే అవకాశం ఉందని తెలిపారు. తల్లిదండ్రులు ఇద్దరు పాపలకు లైలో, ఇమేలా అని పేరు పెట్టారు.