కౌటాల : మహారాష్ట్రలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కౌటాల మండలం తుమ్మిడి హెట్టి ( Tummadihetti) గ్రామ సరిహద్దులో గల ప్రాణహిత నదిలో (Pranahita River) వరద నీరు నిండుకుండను తలపిస్తోంది. ప్రాణహిత నదిలోకి మహారాష్ట్ర నుంచి పెనుగంగా , వార్ధా నదులలో భారీగా వరద నీరు చేరడంతో ప్రాణహితలో వరద ప్రవాహం భారీగా పెరిగింది.
గురువారం సాయంత్రానికి ప్రాణహిత నది ఒడ్డున గల పుష్కర ఘాట్లకు సమాంతరంగా వరద నీరు చేరాయి. దీనితో వార్ధా నది పరివాహక ప్రాంతాల్లోని గుందైపేట, తాటిపెళ్లి, వీర్ధండి గ్రామ శివారులలోని పంట పొలాల్లోకి వరద నీరు చేరింది. సిర్పూర్ మండలం వెంకట్రావుపేట్ బోర్డ్స గ్రామాల సరిహద్దులో గల బ్రిడ్జిని వరద నీరు తాకింది. ఇప్పటివరకు కౌటాల, సిరిపూర్ మండల వ్యాప్తంగా భారీ వర్షం కురువకపోవడంతో కుంటలు చెరువులలో ఎక్కడా నీరు రాలేదు.