Powerful Explosio | పాకిస్థాన్ (Pakistan)లో భారీ పేలుడు (Powerful Explosion) సంభవించింది. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టా (Quetta)లో జరిగిన ఈ పేలుడులో పలువురు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు.
క్వెట్టాలోని జర్ఘున్ రోడ్ (Zarghun Road)లోని గల పాక్ ఫ్రంటియర్ కోర్ ప్రధాన కార్యాలయం (Frontier Corps Headquarters) సమీపంలో మంగళవారం ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి సమీపంలోని భవనాలు, ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మంది వరకూ గాయపడ్డారు. పేలుడు తర్వాత ఆ ప్రాంతంలో కాల్పులు శబ్దం కూడా వినిపించినట్లు స్థానికులు తెలిపారు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ప్రాణనష్టం అధికంగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని ఆస్పత్రుల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. అయితే, ఈ పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పేలుడు దృష్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.
8 people, including three personnel of the Frontier Corps (FC) killed in a powerful explosion on Zarghun Road in Quetta #Pakistan
Blast took place close to the FC Balochistan security facility, a high-security area of the provincial capital. Authorities say the… pic.twitter.com/JMgMtrelOj
— Nabila Jamal (@nabilajamal_) September 30, 2025
Also Read..
School Collapse | పాఠశాల భవనం కూలి ఒకరు మృతి.. శిథిలాల కింద చిక్కుకుపోయిన 65 మంది విద్యార్థులు
Donald Trump | ట్రంప్ మరో టారిఫ్ బాంబ్.. కలప, ఫర్నిచర్‌పై సుంకాల మోత
PM Modi | పశ్చిమాసియాలో దీర్ఘకాలిక శాంతికి మార్గం.. గాజాపై ట్రంప్ ఫార్ములాను స్వాగతించిన భారత్