పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా రామగుండంలోని(Ramagundam) 62.5మెగావాట్ల సామర్థ్యం కలిగిన రామగుండం బీ థర్మల్( B Therma) విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తికి మళ్లీ అంతరాయం(Disrupted) కలిగింది. మంగళ వారం సాయంత్రం బాయిలర్ ట్యూబ్ లికేజీగా గుర్తించిన ఇంజినీర్లు వెంటనే యూనిట్లో విద్యుత్‌ను నిలిపివేసి యుద్ధప్రతిపాదికన మరమ్మతులు చేపట్టారు. గురువారం సాయంత్రం వరకు ఉత్పత్తి దశలోకి వచ్చేలా పనులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ విద్యుత్ కేంద్రం తన 50 ఏళ్ల జీవితకాలం పూర్తి చేసుకోగా, తరుచూ యూనిట్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతూ, విద్యుదుత్పత్తికి బ్రేక్ పడుతున్నది. ఇటీవల ప్లాంటులో జరిగిన చిన్న ఫైర్ యాక్సిడెంట్‌తో సాంకేతిక సమస్యలు మరింత పెరిగి, గత నెల రోజుల వ్యవధిలోనే మూడు సార్లు విద్యుదుత్పత్తికి ఆటంకం జరిగింది.