జైనూర్/అందోల్, అక్టోబర్ 13: ఆదివాసీల ఆరాధ్య దైవం కుమ్రంభీం ముఖచిత్రంతో పోస్టల్ శాఖ ప్రత్యేక కవర్‌ను రూపొందించింది. ఆ కవర్‌ను బుధవారం తపాలా శాఖ అధికారులు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యు) మండలం ధోబా గ్రామంలో ఆవిష్కరించారు. కాగా సంగారెడ్డి జిల్లా అందోల్‌కు చెందిన ప్రముఖ ఉర్దూ కవి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మఖ్దూం మొహియొద్దీన్ స్మారకార్థం రూపొందించిన ప్రత్యేక పోస్టల్ కవర్‌ను బుధవారం ఆ శాఖ అధికారులు అందోల్‌లో విడుదల చేశారు.