Covaxin | కరోనాను నియంత్రించడానికి తయారుచేసిన కొవాగ్జిన్‌కు బ్రిటన్, కెనడా తదితర దేశాల అనుమతి కోసం భారత్ బయోటెక్ ఎదురుచూస్తోంది. ఇప్పటికే కొవాగ్జిన్‌ను అత్యవసర పరిస్థితుల్లో వాడేందుకు అనుమతి ఇస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆదేశాలు జారీ చేసింది. కొవాగ్జిన్‌కు అనుమతిపై దశల వారీగా నిర్ణయం తీసుకుంటామని భారత్‌లో బ్రిటన్ హైకమిషన్ అధికార ప్రతినిధి శనివారం చెప్పారు. ఈ విషయమై అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పని చేస్తామన్నారు. సమీప భవిష్యత్‌లో బ్రిటన్యేతర వ్యాక్సిన్లను గుర్తించొచ్చునన్నారు.
ప్రస్తుతానికి ఫైజర్ బయోటెక్, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా/కొవిషీల్డ్, జాన్‌స్సెన్ తదితర వ్యాక్సిన్లను ఆమోదించామని కెనడా హైకమిషన్ అధికార ప్రతినిధి చెప్పారు. ఆ జాబితాలో కొవాగ్జిన్ పేరు లేదు. కొవిడ్-19 డ్రగ్, వ్యాక్సిన్లను నిర్ధిష్ట సమయంలో సమీక్షిస్తామని, భద్రతపై రాజీ లేకుండా ప్రమాణాలను బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు.