హైదరాబాద్, జూలై 2(నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వీబీ-జీ రామ్-జీ చట్టంపై న్యాయపరంగా పోరాటం చేయాలని, కొత్తచట్టంలో విధించిన నిబంధనలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని క్యాబినెట్ నిర్ణయించినట్టు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ అంశంపై గురువారం జరిగిన క్యాబినెట్ లో చర్చించింది. చట్టంలో పొందుపరిచిన నిబంధనలపై మంత్రివర్గం నిరసన తెలిపింది. ఈ కొత్త చట్టాన్ని 2026 జూలై 1 నుంచి రాష్ట్రంలో అమల్లోకి తెచ్చేందుకు జారీ చేసిన నోటిఫికేషన్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు చెప్పారు. ఈ మేరకు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి పొంగులేటి మీడియాకు వెల్లడించారు.