న్యూఢిల్లీ, జూలై 2: రష్యాలోని చమురు రిఫైనరీలపై ఉక్రెయిన్ నెలల తరబడి జరుపుతున్న దాడులతో చమురు సంక్షోభంలో చిక్కుకున్న రష్యా భారత్ నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకోవడానికి సిద్ధపడుతున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.
ఉక్రెయిన్ దాడులు రష్యాలో తీవ్ర చమురు సంక్షోభాన్ని సృష్టించి దేశంలోని 11 టైమ్ జోన్లు అంతటా రేషనింగ్, వాహనదారులకు సరఫరా కొరతకు దారితీశాయి. ప్రజలు గ్యాస్ స్టేషన్ల వద్ద బారులుతీరి నిలబడటం, పెట్రోల్ ధరలలో రికార్డు స్థాయి పెరుగుదల వంటి ప్రభావాలు కనిపిస్తున్నాయి.