వీబీ-జీ రామ్-జీపై న్యాయపోరాటం
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వీబీ-జీ రామ్-జీ చట్టంపై న్యాయపరంగా పోరాటం చేయాలని, కొత్తచట్టంలో విధించిన నిబంధనలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని క్యాబినెట్ నిర్ణయించినట్టు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
- పథకం అమలు చేస్తూనే సుప్రీంకోర్టులో పోరాడుతాం
- టిమ్స్ దవాఖానల్లో 6,278 పోస్టులను భర్తీ చేస్తాం
- మూసీ రివర్‌ఫ్రంట్ పనులకు రూ.7,345.12 కోట్లు
- క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పొంగులేటి
హైదరాబాద్, జూలై 2(నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వీబీ-జీ రామ్-జీ చట్టంపై న్యాయపరంగా పోరాటం చేయాలని, కొత్తచట్టంలో విధించిన నిబంధనలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని క్యాబినెట్ నిర్ణయించినట్టు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ అంశంపై గురువారం జరిగిన క్యాబినెట్ లో చర్చించింది. చట్టంలో పొందుపరిచిన నిబంధనలపై మంత్రివర్గం నిరసన తెలిపింది. ఈ కొత్త చట్టాన్ని 2026 జూలై 1 నుంచి రాష్ట్రంలో అమల్లోకి తెచ్చేందుకు జారీ చేసిన నోటిఫికేషన్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు చెప్పారు. ఈ మేరకు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి పొంగులేటి మీడియాకు వెల్లడించారు.
క్యాబినెట్ నిర్ణయాలు..
- ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బందికి కూడా వర్తింపు.
- టిమ్స్లతోపాటు సూపర్ స్పెషాలిటీ దవాఖానల్లో భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టాలని నిర్ణయం. సనత్‌నగర్, ఎల్బీ నగర్, అల్వాల్ టిమ్స్‌తోపాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన లో వైద్యులు, వైద్య సిబ్బంది పోస్టులు మంజూరు చేసింది. మొత్తం 6,278 పోస్టుల మంజూరుకు ఆమోదం. ఇందు లో 1,494 రెగ్యులర్ పోస్టులు, 549 కాంట్రాక్ట్, 4,235 అవుట్సోర్సింగ్ పోస్టులకు అనుమతించింది.
- మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్లో భాగంగా ఫేజ్-1 పనులకు పాలనా అనుమతులు మంజూరు. తొలి దశలో 21 కి.మీ. పొడవున అభివృద్ధికి 7,345.12 కోట్ల విలువైన పనుల మంజూరు.
- వరంగల్ జిల్లా బొల్లికుంటలో నిత్యావసరాల గోదాముల నిర్మాణానికి 50 ఎకరాలు, రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం కరాలపహాడ్లో 10 ఎకరాలను రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు మారెట్ రేట్ ప్రకారం కేటాయించేందుకు ఆమోదం.
- జవహర్ నవోదయ విద్యాలయాలకు మహబూబ్‌నగర్ జిల్లా పెద్దాయిపల్లిలో 20.18 ఎకరాలు, సూర్యాపేట జిల్లా కోదాడలో 19.12 ఎకరాల భూమిని కేటాయింపు. జగిత్యాల జిల్లా చల్గల్ గ్రామంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు 5 ఎకరాలు కేటాయించాలని క్యాబినెట్ నిర్ణయించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

