హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ కోర్సుల సీట్ల భర్తీకి నిర్వహించే టీజీ పాలిసెట్ మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ మంగళవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ నెల 28 వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవచ్చు.
26 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. 26 నుంచి జూలై 1 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. జూలై 4లోపు సీట్లు కేటాయిస్తారు. వివరాల కోసం https://tgpolycet.nic.in వెబ్సైట్ను సంప్రదించాలని ప్రవేశాల కమిటీ కన్వీనర్ ఏ దేవసేన సూచించారు.