న్యూఢిల్లీ, జనవరి 10: కేంద్రం త్వరలో 11 ఆధునిక రైళ్లను ప్రవేశపెట్టనుంది. అయితే వీటిలో ఎక్కువగా ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకే కేటాయిస్తున్నారు.
వచ్చే వేసవిలో ఎన్నికలు జరిగే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోం, రాష్ర్టాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు కన్పిస్తోంది. వీటిని ఈ నెల 18 లేదా 19న ప్రధాని ప్రారంభించే అవకాశాలున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.