అగర్తలా: త్రిపురలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ హత్యలు పెరిగిపోయాయని సీపీఐ(ఎం) నేత, మాజీ సీఎం మాణిక్ సర్కార్ ధ్వజమెత్తారు. ‘2018 ఎన్నికల తర్వాత బీజేపీ-ఐపీఎఫ్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి రాజకీయ హత్యలు పెరిగిపోయాయి. దాదాపు 24 మంది సీపీఐ(ఎం) నేతలు, కార్యకర్తలు హత్యకు గురయ్యారు’ అని తెలిపారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి రాజ్యమేలాలనుకుంటున్న వారి ఆటలు సాగవని హెచ్చరించారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతున్నదని ఆరోపించారు.