హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరాల్లో మీరు డబ్బులు పొగొట్టుకున్నారా? అయితే 24 గంటల్లో జాతీయ హెల్ప్‌లైన్ 155260తోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న వెబ్ పోర్టల్‌కు ఫిర్యాదు చేయాలి. అలా చేస్తే పోగొట్టుకున్న సొమ్మును సైబర్ క్రైం ఖాతాల్లోకి బదిలీ కాకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సైబర్ నేరగాళ్ల ఖాతాల్లో డబ్బు ఉన్నప్పుడు వెంటనే బ్యాంక్ అధికారులను అప్రమత్తం చేసి వాటిని ఫ్రీజ్ చేస్తారు. మోసం జరిగిన 24 గంటల్లోపు ఫిర్యాదు చేస్తేనే ఇది సాధ్యమవుతుందని సైబర్ క్రైం పోలీసులు పేర్కొంటున్నారు. అయితే ఈ ఫిర్యాదు నమోదు చేసే సమయంలో ఈ వివరాలు మీ వద్ద ఉండాలి.
ఫిర్యాదు నమోదుకు మీ దగ్గర ఉండాల్సినవి..
ఫిర్యాదు ఎక్కడ చేయాలి: