మొయినాబాద్, ఫిబ్రవరి19 : చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్‌పై దాడి చేసిన నిందితుడు వీరరాఘవరెడ్డిని రెండోరోజు బుధవారం మొయినాబాద్ పోలీసులు విచారించారు. సీఐ పవన్‌కుమార్‌రెడ్డి విచారిస్తుండగా రామరాజ్యం అనే వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో వివరించాడు. 2014-15 విద్యా సంవత్సరంలో తమ బిడ్డ రెండో తరగతి చదువుతున్న సమయంలో పాఠశాల యాజమాన్యం డిటెయిన్ చేశారని, జిల్లా విద్యా శాఖ పట్టించుకోకపోవడంతో 14 ఏండ్లలోపు పిల్లలను పై తరగతులకు డిటెయిన్ చేసే హక్కు లేదని సుప్రీంకోర్టులో రిట్ వేశానని చెప్పారు.
అక్కడ కూడా న్యాయం జరగకపోవడంతో రామరాజ్యం స్థాపనతో వ్యవస్థలను ప్రశ్నించవచ్చని ఒకసాధువు చెప్పడంతో రామరాజ్య స్థాపన చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు. అర్చకుడు రంగరాజన్‌ను వీరరాఘవరెడ్డి రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని కోరగా ఆయన అంగీకరించక పోవడంతో తన సైనికులు దాడిచేశారని, దానికి చింతిస్తున్నానని పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు.