కొత్తగూడెం ప్రగతి మైదాన్ : ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ-ఛత్తీస్గఢ్ పోలీసులు మంగళవారం హై అలర్ట్ ప్రకటించారు. ఆపరేషన్ ‘కగార్’కు నిరసనగా బీజాపూర్-సుక్మా-దంతెవాడ జిల్లాల బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. దీంతో ఇరు రాష్ర్టాల పోలీసు యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల, పూసుగుప్ప, మారాయిగూడెం అటవీ ప్రాంతాల్లో భద్రతా దళాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. బంద్ నేపథ్యంలో మావోయిస్టులు అలజడి సృష్టించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.