ఆలేరు టౌన్, జూలై 15 : గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణను ఉక్కుపాదంతో అణిచివేస్తామని ఆలేరు సీఐ కొండల్రావు, ఎక్సైజ్ సీఐ దీపిక అన్నారు. రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు మంగళవారం ఆలేరు రైల్వే స్టేషన్లో సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ నుండి సికింద్రాబాద్ వెళ్లే రైళ్లు ఈస్ట్ కోస్ట్, వరంగల్ ప్యాసింజర్ రైళ్లలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో యువత డ్రగ్స్, గంజాయికి బానిసలవుతున్నారన్నారు. మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా యువత చదువు, కెరీర్లపై దృష్టి సారించాలని కోరారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని పేర్కొన్నారు.