ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 38వ బర్త్ డే వేడుకలు శుక్రవారం రోజు ఘనంగా జరిగాయి. ఓ వైపు పుష్ప టీజర్‌తో చిత్ర బృందం ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేయగా, మరోవైపు అభిమానులు బన్నీ ఇంటి వద్దకు భారీగా చేరుకొని నానా హంగామా చేశారు. అయితే అభిమానులు తన ఇంటి ముందు ఉన్న విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ బయటకు వచ్చి అందరిని పలకరించి వెళ్లారు.
అయితే బన్నీ అభిమానులు ఇద్దరు కాస్త అత్యుత్సాహం చూపించి అర్ధరాత్రి ఆయన ఇంటి ముందు బాణాసంచా కాల్చారు. ఇది పక్కన వాళ్లకు ఇబ్బంది కరంగా మారడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు బాణాసంచా కాలుస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.