రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 30( నమస్తే తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లాలో అక్రమ అరెస్టు మొదలయ్యాయి. జిల్లాలో బుధవారం సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, బహిరంగ సభ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు.
సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండలాలు, గ్రామాల్లోని ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు, సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ యూత్ , మాజీ సర్పంచ్లను సైతం తెల్లవారుజామునే అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ నేతలు, సర్పంచులు వినూత్న నిరసన తెలిపారు. పోలీస్ స్టేషన్లోనే పండ్లు తోముకుంటూ సీఎం రేవంత్ రెడ్డి తీరుకు, అక్రమ అరెస్టు నిరసన గా ఆందోళన చేశారు. 6 గ్యారంటీలు, 420 హామీలు నెరవేర్చకుండా, ప్రజలను మోసం చేస్తూ సిరిసిల్లలో కేటీఆర్ పై కక్షతో సభ పెట్టారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో వస్తున్న రేవంత్ రెడ్డి,ఇచ్చిన హామీలు సిరిసిల్ల సభలో అమలు చేస్తున్నట్టు ప్రకటించాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల జిల్లాలోని సమస్యలను, సిరిసిల్ల అభివృద్ధికి మూడేళ్లలో ఏం చేశారని ప్రశ్నించారు. 8000 ఎకరాలు కబ్జాకు గురయ్యాయని, 2400 ఎకరాల భూమిని రికవరీ చేశామని అసెంబ్లీలో చెప్పిన రేవంత్ రెడ్డి సిరిసిల్ల సభలో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిరిసిల్లలో కేటీఆర్ చేసిన అభివృద్ధిని చూసి బుద్ధి తెచ్చుకొని కనీసం మీ కొడంగల్ లోనైనా అభివృద్ధి చేసుకోవాలని హితువు పలికారు. పోలీసులతో అక్రమ అరెస్