Secunderabad | ఎంతో ఘన చరిత్ర కలిగిన సికింద్రాబాద్ ప్రాంత అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు పోరాటం చేస్తున్న బిడ్డలపై కాంగ్రెస్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. సికింద్రాబాద్ అస్థిత్వం, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి క్లాక్‌టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్ సర్కిల్ మీదుగా ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వరకు శాంతి ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధం కావడంతో ఎక్కడికక్కడ ఆంక్షలు, నిర్భంధాలతో పోలీసులు అణిచివేస్తున్నారు. శాంతి ర్యాలీ అని చెప్పినా వినిపించుకోకుండా జులుం ప్రదర్శిస్తున్నారు.
శాంతి ర్యాలీలో పాల్గొనేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. బలవంతంగా అరెస్టు చేసి వ్యాన్లలో తరలిస్తున్నారు. ఆల్ఫా హోటల్ లోపలికి వెళ్లి మరీ అరెస్టు చేస్తున్నారు. బీఆర్ఎస్ శాంతి ర్యాలీ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌తో పాటు ప్యాటీ సెంటర్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాతనే పంపిస్తున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ప్యాట్నీ సెంటర్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు
సికింద్రాబాద్ బచావో ర్యాలీ నేపథ్యంలో స్థానిక నాయకులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
ఆల్ఫా హోటల్లో టిఫిన్ చేస్తున్న వారిని బలవంతంగా అరెస్ట్ చేసి, హోటల్ మూసివేయడంతో, పోలీసుల తీరుపై మండిపడుతున్న… https://t.co/mTKKt4mYK0 pic.twitter.com/Xj0M9214xn
— Telugu Scribe (@TeluguScribe) January 17, 2026