Ek Din Teaser | ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘ఏక్ దిన్’ (Ek Din). సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆమిర్ ఖాన్ స్వయంగా నిర్మిస్తున్నారు. రామ్ సంపత్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రం వేసవి కానుకగా మే 1, 2026న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా టీజర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది.
కొన్ని ప్రేమకథలకు కాలంతో పనిలేదు అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో వచ్చిన ఈ టీజర్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని తలపిస్తోంది. జపాన్‌లోని సపోరో వంటి అందమైన మంచు ప్రదేశాలలో చిత్రీకరించిన ఈ విజువల్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 2016 నాటి థాయ్ సినిమా ‘వన్ డే’కి అధికారిక రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి ‘మీరా’ అనే పాత్రలో కనిపిస్తుండగా, ఆమె ప్రేమను గెలుచుకోవడానికి ప్రయత్నించే యువకుడిగా జునైద్ ఖాన్ తన నటనతో మెప్పించబోతున్నాడు. ప్రస్తుతం సాయి పల్లవి ఈ సినిమాతో పాటు నితేష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణం’లో సీత పాత్రలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.