Poco C81 : దేశంలో ఇప్పటికీ 4జీ ఫోన్లు వాడేవాళ్లు చాలా మంది. అందులోనూ బేసిక్ మోడల్స్ వాడేవారు కూడా కోట్లలో ఉన్నారు. అలాంటివారి కోసమే పోకో సంస్థ కొత్తగా మరో రెండు ఫోన్లు మార్కెట్లోకి తీసుకొచ్చింది. పోకో సీ81, సీ81 ఎక్స్ పేర్లతో తక్కువ ధరలోనే బేసిక్ ఫీచర్లతో ఈ ఫోన్లు లాంఛ్ చేసింది. మంచి హార్డ్‌వేర్, పెద్ద బ్యాటరీ, పెద్ద డిస్ప్లే వంటివి వీటి ప్రత్యేకతలు. ఈ నెల 27 నుంచి ఈ ఫోన్లు ఆన్లైన్లో సేల్కు అందుబాటులో ఉంటాయి. ఈ ఫోన్ల ధర, ఇతర కీలక ఫీచర్లివి.
పోకో సీ81
6.9 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్, 650 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఆక్టాకోర్ యునిసాక్ టీ7250 చిప్సెట్, 3జీబీ+64జీబీ, ఎక్స్‌పాండబుల్ అప్ టు 2టీబీ, 5,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్, 7.5 వాట్స్ రివర్స్ వైర్డ్ ఛార్జింగ్, 1,000 ఛార్జింగ్ సైకిల్స్ తర్వాత కూడా 80 శాతం హెల్దీ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 15 ఓఎస్ , 13 ఎంపీ మెయిన్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఐపీ 52 రేటింగ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ వంటి ఫీచర్లున్నాయి. ఇది ఎలైట్ బ్లాక్, ఐస్ బ్లూ కలర్స్‌లో లభ్యం. ధర రూ.10,999.
పోకో సీ81 ఎక్స్
6.88 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఆక్టాకోర్ యునిసాక్ టీ7250 చిప్సెట్, 4జీబీ+64జీబీ, 6,300 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్, 7.5 వాట్స్ రివర్స్ వైర్డ్ ఛార్జింగ్, 1,000 ఛార్జింగ్ సైకిల్స్ తర్వాత కూడా 80 శాతం హెల్దీ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16 బేస్డ్ హైపర్ ఓఎస్ 3, 13 ఎంపీ మెయిన్ కెమెరా విత్ సెన్సర్, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఐపీ 52 రేటింగ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ వంటి ఫీచర్లున్నాయి. ఇది ఎలైట్ బ్లాక్, ఐస్ బ్లూ, సన్‌సెట్ గోల్డ్ కలర్స్‌లో లభ్యం. ధర రూ.9,999.