PM Modi: 194 ఏళ్ల తాబేలును కలుసుకోనున్న ప్రధాని మోదీ
PM Modi: వచ్చే వారం సీషెల్స్‌లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఆ సమయంలో అక్కడ బోటానికల్ గార్డెన్లో ఓ మొక్కను ఆయన నాటనున్నారు. ఆ తర్వాత ప్రాణాలతో జీవిస్తున్న వృద్ధ తాబేలును ఆయన కలుసుకోనున్నారు. ఆ తాబేలు వయసు 194 ఏళ్లు.
న్యూఢిల్లీ: హిందూ మహాసముద్ర ద్వీపం సీషెల్స్‌లో వచ్చే వారం ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఆ పర్యటన వేళ ఆయన అక్కడ నేషనల్ బోటానికల్ గార్డెన్స్ వెళ్లనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆయన అక్కడ ఓ వృక్షాన్ని నాటనున్నారు. భారత్, సీషెల్స్ మధ్య 50 ఏళ్ల దౌత్య బంధానికి ప్రతీకగా ప్రధాని మోదీ ఈ పర్యటన చేపట్టనున్నారు. సీషెల్స్ జాతీయ దినోత్సవ సంబరాల్లో మోదీ గౌరవ అతిథిగా పాల్గొంటారు. ఇక ప్రపంచంలో ప్రాణాలతో ఉన్న అతి వృద్ధ జంతువును కూడా ప్రధాని మోదీ కలుసుకోనున్నారు.
1832లో పుట్టిన తాబేలును ఆయన వీక్షించనున్నారు. ఆ తాబేలు పేరు జోనాథన్. ఇప్పుడు అది సుమారు 194 ఏళ్లు ఉంటుందని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అంచనా వేసింది. సుమారు రెండు శతాబ్ధాలకు చేరుకున్న ఆ జంతువు ఎన్నో చరిత్రాత్మక సందర్భాలకు సాక్షీగా నిలిచింది. వయసు మీరినా ఆ తాబేలు మాత్రం ఆరోగ్యకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వెటరర్నీ డాక్టర్లు దాని ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నారు. అయితే వయసు రీత్యా ఆ తాబేలుకు కంటి చూపు మందగించింది. వాసన గుర్తుపట్టే గుణాన్ని కూడా కొంత కోల్పోయినట్లు తెలుస్తోంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
‘పంచాయతీల సమస్యలను పరిష్కరించాలి’
‘కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి కోదాడ పబ్లిక్ క్లబ్‌కు తీరని లోటు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

