మిల్కాసింగ్ ఆరోగ్యంపై మోదీ ఆరా
మిల్కాసింగ్ ఆరోగ్యంపై మోదీ ఆరా | భారత స్ప్రింట్ లెజెండ్ మిల్కాసింగ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఆరా తీశారు. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న అథ్లెట్లను ఆశీర్వదించేందుకు, ప్రేరణ అందించేందుకు మిల్కా సింగ్ పూర్తిగా కోలుకొని ఆరోగ్యవంతుడిగా త్వరలోనే తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీ : భారత స్ప్రింట్ లెజెండ్ మిల్కాసింగ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఆరా తీశారు. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న అథ్లెట్లను ఆశీర్వదించేందుకు, ప్రేరణ అందించేందుకు మిల్కా సింగ్ పూర్తిగా కోలుకొని ఆరోగ్యవంతుడిగా త్వరలోనే తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. శరీరంలో ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో 91 సంవత్సరాల దిగ్గజ స్ప్రింటర్ చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఆర్) ఆసుపత్రికి తరలించారు.
ఆయన మే 20న కరోనా బారినపడ్డారు. చికిత్స నిమిత్తం మొదట మొహాలిలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత కోలుకోగా.. గత ఆదివారమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ క్రమంలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతో గురువారం రాత్రి చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్ ఆసుపత్రిలో చేర్పించారు. ఐసీయూకు తరలించి, చికిత్స అందిస్తుండగా.. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. మిల్కా సింగ్ భార్య నిర్మల్ కౌర్ సైతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
ఇవి కూడా చదవండి..
బలవంతపు ఆమోదం కోసమే..
ఫేక్ న్యూస్‌పై ఫిర్యాదుకు 87997 11259
నేడు రక్షణశాఖ సమావేశం.. ప్రాజెక్టు-75పై చర్చ
నేటి నుంచి తిరుమలలో హనుమాన్ జయంతి ఉత్సవాలు
ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్.. భయాందోళనకు గురైన స్థానికులు
కరోనాతో 624 మంది వైద్యుల మృతి
మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. మళ్లీ ఎంత పెరిగిందంటే?
కోవిన్ పోర్టల్‌లో తెలుగు.. అందుబాటులోకి తెచ్చిన కేంద్రం
దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?
కథా రచయిత కారా మాష్టారు కన్నుమూత
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

