న్యూఢిల్లీ: రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడు పదవీకాలం ముగిసింది. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీ వీడ్కోల సందేశం వినిపించారు. సభలో చాలా భావోద్వేగ వాతావరణం నెలకొన్నట్లు ఆయన తెలిపారు. ఎన్నో చరిత్రాత్మక సందర్భాలతో వెంకయ్యకు అనుబంధం ఉందని ప్రధాని అన్నారు. రాజకీయాల నుంచి రిటైర్ అయ్యాను, కానీ ప్రజాజీవితం నుంచి కాదు అని మీరు పలుమార్లు చెప్పారని, ఈ సభలో మీ బాధ్యత, నాయకత్వం ముగిసిపోవచ్చు కానీ, దేశ ప్రజలు మీపై ఆధారపడి ఉన్నట్లు ప్రధాని తెలిపారు. ఈసారి స్వాతంత్య్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం సంతోషంగా ఉందని, ఎందుకంటే ఈ దేశ రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, స్పీకర్, ప్రధాని కూడా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పుట్టినవారే అని మోదీ అన్నారు. అందరూ సాధారణ స్థితిగతుల నుంచి వచ్చినవారే అని తెలిపారు.